»Shock For Brs Chevella Mla Kale Yadaiah Joins Congress
BRS: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. నేడు మరో ఎమ్మెల్యే పార్టీని వీడారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Shock for BRS.. Chevella MLA Kale Yadaiah joins Congress
BRS: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. వరుసగా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే పార్టీ వీడారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య నేడు కాంగ్రెస్ గూటికి చేరకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఢిల్లీలో అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగయ్యతో కలిపి మొత్తం ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్‌లోకి చేరారు.
చేవెళ్ల నియోజకవర్గం నుంచి కాలె యాదయ్య వరుసగా మూడోసారి గెలుపొందారు. అయితే 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నిలబడి గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బీమ్ భరత్‌పై కేవలం 268 ఓట్ల తేడాతో దెలుపొందారు. ఇప్పుడు మళ్లీ సొంతగూటికి వెళ్లారు.