ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కొత్త రికార్డు నెలకొల్పనుంది.. హైదరాబాద్ లో, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని విగ్రహాలు ఉన్నా, వినాయక చవితి కి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత వేరు. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా, దేశం మొత్తం ఈ విగ్రహాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈసారి సప్త మహాగణపతిగా స్వామివారు భక్తులకు దర్శమివ్వనున్నారు. ఈ ఏడాది కూడా ఆ ప్రత్యేకతను ఆర్గనైజర్లు చూపించబోతున్నారు. 70 అడుగుల ఎత్తుతో ప్రత్యేకంగా రూపొందించబడింది. అయోధ్య బాలరాముడు విగ్రహాన్ని స్వామివారి దగ్గర ఏర్పాటుచేయనున్నారు. సప్త మహాగణపతి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివ పార్వతుల కళ్యాణం విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.
స్వామివారి విగ్రహ పనుల్లో తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన సుమారు 200 మంది కార్మికులు వివిధ పనుల్లో పని చేస్తున్నారు. సెప్టెంబర్ 7, శనివారం పండుగ సందర్భంగా, ఖైరతాబాద్‌లో భద్రతా చర్యలు మరింత కఠినంగా ఉంటాయి. సెప్టెంబర్ 17, మంగళవారం రోజున ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరగనుంది. పోలీసుల మరియు అధికారులు పర్యవేక్షణను పటిష్టం చేసి, భక్తులు సురక్షితంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటారు.
ఈ విశాలమైన విగ్రహం, దేశవ్యాప్తంగా గణేష్ భక్తుల్ని ఆకర్షిస్తోంది. ప్రతి సంవత్సరం, ఖైరతాబాద్ గణేష్ చతుర్థి వేడుకలు ప్రత్యేకమైన ఉత్సవం గా మారి, స్థానిక మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందుతోంది. ప్రత్యేక కాంతి అలంకరణలు, రంగుల ఉత్సవాలు, మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగను మరింత ప్రత్యేకంగా మార్చడం కోసం ఏర్పాట్లు చేపట్టారు.