తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో శ్రీవారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి.
Tirumala: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో శ్రీవారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం మార్గం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి ఏడుకొండల స్వామిని దర్శించుకున్నారు. ఉదయం తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు. ఆ తర్వాత వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో శ్రీవారిని దర్శించుకున్నారు.
స్వామివారిని దర్శించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురిశాయని తెలిపారు. ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. ఆ స్వామి వారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్ర్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని, అలాగే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తెలిపారు.