ELR: ఏలూరులో బాలికపై అత్యాచారం అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం అసత్యమని టూ టౌన్ సీఐ అశోక్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ… స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఉండటం ద్వారా మైనర్ బాలికగా భావించారని ఆమె ఓ వివాహిత అని స్పష్టం చేశారు. ఆమెతో మాట్లాడి ప్రాథమిక నిర్ధారణ ఆధారంగా ఏ అఘాయిత్యం జరగలేదని, అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు.