Gold and Silver Rates Today : బంగారం, వెండిని కొనుక్కోవాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం కాదనే చెప్పాలి. ఎందుకంటే వీటి ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో గరిష్ఠ ధరలను నమోదు చేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర మంగళవారం రూ.47 పెరిగి రూ.76,495కు చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ..76,495గా కొనసాగుతోంది. ఈ ధర ఈ ఉదయం మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నదని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు ఈ ధరకు అదనంగా జీఎస్టీ, మజూరీల్లాంటివి తోడవుతాయని గమనించుకోవాలి.
దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate)లు భారీగా పెరిగిపోతూనే ఉంటున్నాయి. బుధవారం కిలో వెండి ధర రూ.760 పెరిగింది. దీంతో నేడు దీని ధర రూ.95,680కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరుల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి, బంగారం రెండూ కూడా నేటి మార్కెట్ ప్రారంభ సమయానికి అప్ ట్రెండ్‌లోనే ఉండటం గమనించదగ్గ విషయం.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు సైతం పెరిగాయి. బుధవారం ఔన్సు గోల్డు ధర నాలుగు డాలర్లు పెరిగి 2416 డాలర్లకు చేరింది. అలాగే ఔన్సు వెండి ధర ప్రస్తుతం 31.74 డాలర్లుగా ఉంది.