ASR: జిల్లా పంచాయతీ అధికారి కేపీ చంద్రశేఖర్ బుధవారం గూడెం కొత్తవీధి మండలంలో పర్యటించారు. వంచుల, రింతాడ పంచాయతీల్లో పర్యటించిన ఆయన, ఆయా పంచాయతీల్లో గ్రామ సచివాలయాల సిబ్బంది అందిస్తున్న సేవలను తనిఖీ చేశారు. పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణపై సచివాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామాల్లో చెత్త సేకరణ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.