ASR: పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఆషాడమాసం గోరింటాకు సంబరాలను తెలుగు శాఖ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి, తెలుగు శాఖ విభాగాధిపతి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రసూల్, మహిళా సాధికార శాఖ కన్వీనర్ పీ.సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.