MLG: మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శబరీష్ తెలిపారు. వరద ప్రవాహం ఉన్న వంతెనలు, రహదారులను ప్రజలు దాటవద్దని సూచించారు. వరద ప్రవాహాల వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులకు సహకరించాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజల తక్షణ సహాయం కోసం DDRF బృందాలను సిద్ధంగా ఉంచామని ఎస్పీ పేర్కొన్నారు.