బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొత్తగా బిడ్డకు జన్మనిచ్చిన తల్లులు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుందని పేర్కొంది. అలాంటి వారికి సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటే మార్పులు తప్పనిసరని తెలిపింది. ప్రపంచంలో ఎక్కడ చిత్రీకరణ చేసినా పాల్గొనడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. 12గంటల పాటు షూటింగ్ చేసినా నాకు అభ్యంతరం లేదని తెలిపింది.