చంద్రశేఖర్ ఆజాద్.. స్వాతంత్ర్య పోరాట యోధుడు. ఈయన అసలు పేరు చంద్రశేఖర్ సీతారాం తివారీ. 15 ఏళ్లకే సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని, తన పేరును ‘ఆజాద్’గా ప్రకటించుకున్నారు. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపిన తరువాత ఆయన సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. బ్రిటిష్ వారికి ప్రాణాలతో చిక్కకూడదనుకున్న ఆయన 1931లో పోలీసులు చుట్టుముట్టడంతో తన తుపాకీతోనే కాల్చుకుని కన్నుమూశారు.