TG: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2021 నవంబర్ 15న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బండి.. ముందస్తు అనుమతి లేకుండా 40 వాహనాలతో ర్యాలీ నిర్వహించారని కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణకు బండి సంజయ్ హాజరుకాకపోవడంతో కోర్టు ఈ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది.