W.G: భీమవరం కళాభవన్ వీధికి చెందిన మద్దన రమేశ్ బాబు ఈనెల 4న మోటార్ సైకిల్ డిక్కీలో రూ. 3 లక్షల నగదు పెట్టుకుని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసుకోగా డబ్బులు మాయమయ్యాయని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా బాలరాజు, రబిలను పట్టుకున్నారు. భీమవరం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ జయసూర్య వివరాలు తెలిపారు.