పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు, తనకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని క్రిష్ జాగర్లమూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘నాకు, పవన్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు కూడా లేవు. నేను ఓపెన్‌గా ఉన్నాను. భవిష్యత్తులో ఆయనతో కలిసి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నాడు. కాగా, ఇటీవల రిలీజైన ‘హరిహర వీరమల్లు’ మూవీకి క్రిష్ కొంత వరకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.