మాంచెస్టర్లో ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియాకు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో వీరిద్దరిని అవుట్ చేశాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్, గిల్ క్రీజులో ఉన్నారు.