AKP: అచ్యుతాపురం మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ముస్తఫా అనే వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్లు సీఐ నమ్మి గణేష్ తెలిపారు. ఈనెల 24న జరిగిన ఈ ఘటనపై బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో 25న పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ముస్తఫాను పట్టుకున్నామని తెలిపారు.