NZB: ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ డివిజన్లలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ కమిషనర్ పీ.సాయి చైతన్య సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు పెరగవచ్చునని, చెరువుల కిందివైపునకు వెళ్లవద్దని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లకూడదని, తెగిపోయిన విద్యుత్తు తీగలకు దగ్గరగా వెళ్లొద్దన్నారు.