ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు చివరి రోజు ఆటలో రెండో సెషన్ ముగిసింది. టీ బ్రేక్ సమయానికి ప్రస్తుతం భారత్ 4 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో జడేజా 53 పరుగులు(102 బంతులు), వాషింగ్టన్ సుందర్ 58 పరుగులు(139 బంతులు) క్రీజులో ఉన్నారు. కాగా, భారత్ రెండో ఇన్నింగ్స్లో 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో సెషన్ ఆట మాత్రమే మిగిలిఉంది.