ప్రకాశం: వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభంపై రైతు సంఘం ప్రకాశం జిల్లా కమిటీ ప్రతినిధులు ఆదివారం రాష్ట్ర మంత్రి డాక్టర్ స్వామికి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆదివారం ఒంగోలులో నేతలకు వినతిపత్రాలు ఇచ్చిన సందర్భంగా వారు మాట్లాడారు. ఈ ఏడాది అధికంగా లో గ్రేడ్ ఉత్పత్తి అయ్యిందని, సరైన ధరలేక రైతులు అల్లాడుతున్నారని పేర్కొన్నారు.