KKD: అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగ్గంపేటలో ఆదివారం ముమ్మర తనిఖీలు చేశారు. జూదం, బొమ్మ బొరుసు, కోడి పందాలు, బెట్టింగ్లు చట్టరీత్యా నేరమని, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ఎస్సై రఘునాథరావు స్థానికులకు సూచించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.