VSP: ఉత్తరాంధ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేష్ బాబు పేర్కొన్నారు. ఆదివారం విశాఖ టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లు, ఐటీ హబ్, పరిశ్రమలు, రైల్వే జోన్, మెట్రో, కేంద్ర విద్యాసంస్థలు వంటి ప్రాజెక్టులతో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.