AP: సంక్షేమ హాస్టళ్లలో సమస్యలంటూ సాక్షి పత్రికలో రాసిన వార్తలపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షిలో అడ్డగోలుగా రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్లపాటు BC హాస్టళ్లను గాలికొదిలేసిన జగన్కు.. అధికారం కోల్పోగానే అవి గుర్తుకొచ్చాయా? అని నిలదీశారు. హాస్టళ్లలో అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో చర్చించేందుకు తాము సిద్ధమని.. YCP నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు.