కోనసీమ: మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం వర్ధంతి ఆదివారం రామచంద్రపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని సూపర్ పవర్‌గా తీర్చి దిద్దడంలో కలాం పాత్ర అమూల్యమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.