KNR: నగరంలోని ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్న మయూర హోటల్‌కు రూ.25 వేలు జరిమానా విధించినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదివారం తెలిపారు. కిచెన్ గది అపరిశుభ్రంగా ఉండగా హోటల్ యాజమాన్యాన్ని మందలించారు. గతంలో కూడా ఈ హోటల్‌కు రూ.10 వేలు జరిమానా విధించగా.. ఇది రెండవ సారి. మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే హోటల్‌ను సీజ్ చేస్తామని కమిషనర్ హెచ్చరించారు.