లోక్‌సభలో ఆపరేషన్ సింధూర్‌పై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చర్చను ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం సత్తాకు నిదర్శనమని తెలిపారు. సైనికులకు తన సెల్యూట్ అన్నారు. దేశ ప్రజలను రక్షించడం తమ బాధ్యత అని చెప్పారు. పాక్ పౌరులకు నష్టం జరగకుండా దాడులు చేశామన్నారు. 22 నిమిషాల్లో ఆపరేషన్ సింధూర్ పూర్తయిందని.. 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామని చెప్పారు.