SRD: ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే PRC ప్రకటించాలని USPC నాయకులు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథి గృహంలో సోమవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు సాయిలు సోమశేఖర్ మాట్లాడుతూ.. ఆగస్టు-1వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ధర్నాలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.