మేడ్చల్: మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. మల్కాజ్గిరి పరిధిలోని మారుతీ నగర్ SLV బేకరీ నుంచి భరత్ నగర్ జంక్షన్ వరకు సీసీ రోడ్డు అభివృద్ధి కోసం రూ.1.15 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నట్లుగా ఆయన తెలియజేశారు. రాబోయే రోజుల్లోనూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.