AP: సింగపూర్ పర్యటనలో భాగంగా పోర్ట్ ఆఫ్ సింగపూర్ సీఈవోతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సింగపూర్ భాగస్వామ్యంతో ఏపీ పోర్టులను తీర్చిదిద్దే అవకాశాలపై చంద్రబాబు చర్చించారు. అనంతరం టువాస్ పోర్టులో ఏఐ వ్యవస్థను సీఎం పరిశీలించారు. పుల్లెల గోపీచంద్, మంత్రులు, అధికారులతో కలిసి సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శించారు.