E.G: రాజానగరం మండలం సంపత్ నగరం గ్రామానికి చెందిన నరాల వెంకటరావు పనిలో భాగంగా సోమవారం బిల్డింగ్ కూలగొట్టే సమయంలో ప్రమాదవశాత్తు గోడ కూలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇంటికి పెద్ద దిక్కుని కోల్పోయిన ఆ కుటుంబానికి 10 లక్షలు నష్టపరిహారం ఇప్పిస్తానని భరోసా కల్పించారు.