WNP: ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ ఆదర్శ సురభి వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. డెలివరీ, ఓపీ రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. సమయపాలన పాటిస్తూ, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రసవాల సంఖ్య పెంచాలి సూచించారు.