NRML: సారంగాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఎరువులు,విత్తనాల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, రసీదు పుస్తకాలు తదితరాలను పరిశీలించారు. వానాకాలం సాగు సమయంలో రైతులకు ఎరువులు, విత్తనాల అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.