E.G: రాజమండ్రిలోని జాంపేట లూథరన్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థుల కోసం చేపట్టిన డైనింగ్ హాల్ నిర్మాణానికి రాజ మహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్య అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.