NZB: కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన వడ్లమూడి హరికృష్ణ (49) అమెరికాలోని వర్జినియా రాష్ట్రంలో ఓ సరస్సులో బోటింగ్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందగా విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన హరికృష్ణ 25 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి ఉద్యోగం చేస్తున్నాడు. హరికృష్ణ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సరస్సులో బోటింగ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు.