E.G: కొవ్వూరు మండలం కాపవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడుగా సుంకర సత్తిబాబు పదవీ బాధ్యతలు చేపట్టారు. దీంతో కొవ్వూరు పట్టణానికి చెందిన పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు సోమవారం ఆయనకు గజమాజ వేసి ఘనంగా సత్కరించారు. సత్తిబాబు జనసేన పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, కష్టపడితే పదవులు వస్తాయనడానికి ఆయనే ఉదాహరణ అని కొనియాడారు.