NZB: బంజారా సంస్కృతి సంప్రదాయాల్లో ముఖ్యమైన తీజ్ పండుగ వేడుకలను ధర్పల్లి మండలంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పెళ్లి కాని అమ్మాయిలు శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు వైభవంగా నిర్వహిస్తామని గ్రామస్థులు పేర్కొన్నారు. ఆధునిక ప్రపంచంలో తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రతి సంవత్సరం తీజ్ ఉత్సవాలను ఉత్సాహభరితంగా నిర్వహిస్తామన్నారు.