SRD: పటాన్చెరు డివిజన్ పరిధిలోని డిగ్రీ కళాశాల ఆవరణలోని అబ్దుల్ కలాం వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి గూడెం మధుసూదన్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఉన్నారు.