W.G: ఆకివీడులో సోమవారం హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన నేపథ్యంలో సీఐ జగదీశ్వరరావు, ఎస్ఐ నాగరాజు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి ఉప్పుటేరు బ్రిడ్జి నుంచి వెలమపేట సెంటర్ చేరుకుని, అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేస్తారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి, “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొంటారు.