SKLM: సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న సందర్భంగా యువత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని శక్తి టీం ఎస్సై బాలకృష్ణ తెలిపారు. ఆదివారం టెక్కలి మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో శక్తి యాప్ పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినిలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.