తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయాన్ని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామికి మోదీ హారతి ఇచ్చారు. అనంతరం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తూత్తుకుడి ఎయిర్‌పోర్ట్‌లో రూ.450 కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్‌ను మోదీ ప్రారంభించారు. రూ.4,900 కోట్లతో పూర్తి చేసిన రోడ్లు, రైల్వే మార్గాలను ప్రారంభించారు.