మాంచెస్టర్ టెస్టులో శుభ్మన్ గిల్, రాహుల్ జోడీ అరుదైన రికార్డును సాధించారు. భారత్ ‘సున్నా’ పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన తర్వాత గిల్(78), రాహుల్(87) కలిసి మూడో వికెట్కు 174 పరుగులు జోడించారు. దీంతో టీమిండియా తరఫున మూడో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు అమర్నాథ్, గుండప్ప విశ్వనాథ్(105 పరుగులు) పేరిట ఉండేది.