GNTR: కొల్లిపర మండలంలో కృష్ణా నది ప్రమాదాలకు కేంద్రంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో బ్యారేజీ నుంచి నీటిని దిగువకు వదలడంతో యువకులు ఈతకు వచ్చి ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. కృష్ణా నదిలో ఇప్పటికే పలువురు చనిపోయిన సంఘటనల నేపథ్యంలో పోలీసులు ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.