ప్రకాశం: సింగరాయకొండలోని ఎస్సీ హాస్టల్లో దురదృష్టవశాత్తు మంటల్లో పడి గాయపడ్డ ఎనిమిదో తరగతి విద్యార్థిని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి శనివారం పరామర్శించారు. ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు వచ్చిన మంత్రి, ముందుగా విద్యార్థి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.