మాంచెస్టర్ టెస్టులో పంత్ కాలికి తీవ్రగాయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాయపడిన ఆటగాడి స్థానంలో లైక్ టు లైక్ సబ్‌స్టిట్యూట్‌కు అవకాశం ఇవ్వాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ సూచించాడు. ఆ వ్యాఖ్యలను మరో మాజీ క్రికెటర్ లాయిడ్ సమర్థించాడు. తీవ్రగాయం కారణంగా ఆరు వారాలు దూరమయ్యే అవకాశం ఉన్న పరిస్థితుల్లో అతడి స్థానంలో మరొకరు ఆడేందుకు అవకాశం ఇవ్వాలని తెలిపాడు.