MDK: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కౌడిపల్లి ఎస్సై రంజిత్ రెడ్డి సూచించారు. చెరువులు, కుంటల వద్దకు చేపల వేటకు వెళ్ళవద్దని, పురాతన ఇళ్లలో నివాసం ఉండవద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలు ముట్టుకోవద్దని, ఏవైనా అత్యవసర పరిస్థితులు ఉంటే 100 నెంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.