కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హృదయపూర్వక నివాళులర్పించారు. ‘మాతృభూమి కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు నా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. ఈ రోజు మన జవాన్ల అసాధారణ పరాక్రమం, దృఢ సంకల్పానికి ప్రతీక. దేశం కోసం వారి అంకితభావం, అత్యున్నత త్యాగం ఎప్పటికీ మనలో నిలిచి ఉంటాయి’ అని ముర్ము పేర్కొన్నారు.