KRNL: ఆదోని మున్సిపాలిటీ 35వ వార్డు అమరావతి నగర్లో పి4 కార్యక్రమాన్ని సచివాలయ అడ్మిన్ నాగబాబు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ పాల్గొన్నారు. 78 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ప్రతీ ఇంటి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని అన్నారు. ప్రతి ఒక్కరూ రెండు కుటుంబాలను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు.