BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో శనివారం ఎస్సై సాకపురం దివ్య మాట్లాడుతూ.. మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, అధికారుల సూచనలను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు.