JGL: భూపరిపాలన శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పట్టణంలోని SKNR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామ పాలన అధికారి రాత పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. అభ్యర్థులు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని రావాలన్నారు. హాల్ టికెట్ ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.