KMM: ప్రతి ఫీవర్ కేసును వైద్య సిబ్బంది ఫాలో అప్ చేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తి అరికట్టేందుకు పారిశుద్ద్య నిర్వహణ చాలా కీలకమని చెప్పారు. మండలాల్లో వైద్య అధికారి, ఎంపిడివో, ఎంపివో సమన్వయంతో పని చేయాలని సూచించారు.