KMR: చైతన్య స్కూల్ సమీపంలో శుక్రవారం ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. వీరంతా శ్రీ చైతన్య స్కూల్కు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.