KRNL: ఎన్నో ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న కమ్మలదిన్నె నుంచి ఎమ్మిగనూరు రహదారి సమస్యను పరిష్కరించాలని సీపీఎం నాయకులు తిక్కన, హనుమంతు డిమాండ్ చేశారు. శుక్రవారం టీడీపీ మంత్రాలయం ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. బాపురంలో సీసీ రహదారి, బసలదొడ్డిలో తాగునీరు, బైచిగేరి వరకు తారు రోడ్డు సమస్యలను పరిష్కరించాలన్నారు.